నవతెలంగాణ-ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్బిడ్–తరోడ రహదారిని గురువారం ట్రైబల్ వెల్ఫేర్ డీఈ శివప్రసాద్, ఏఈఈ ప్రదీప్ లు పరిశీలించారు. మండలం లోని ఎడ్ బిడ్ తండా నుంచి తరోడ వరకు రూ.5.50 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే ఎడ్ బిడ్ తండా నుంచి ఎడ్ బిడ్ వరకు బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. మిగిలిన ఎడ్బిడ్ నుంచి తరోడ వరకు రహదారిని అధికారులు పరిశీలించారు. గతంలో నిర్మించిన కల్వర్టులను తనిఖీ చేశారు. త్వరలోనే బీటీ రోడ్డు పనులను ప్రారంభించనున్నట్లువారు తెలిపారు.
ఎడ్బిడ్–తరోడ రోడ్డు పరిశీలన
1 గంట క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)