Magazines

చించాలలో రాజరాజేశ్వర విగ్రహ ప్రతిష్టాపన

6 గంటల క్రితం

Rajarajeshwara Temple
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

హాజరైన మాజీ ఎమ్మెల్యే  విఠల్ రెడ్డి
నవతెలంగాణ - ముధోల్
ముధోల్ మండలంలోని చించాల గ్రామంలో గురువారం రోజు రాజరాజేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ప్రముఖ వేద పండితుడు బబ్రు మహారాజ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వేదమంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కన్నోల్ల పెద్ద రాజేశ్వర్, నడిపి రాజేశ్వర్, హనుమండ్లు, చిన్న రాజేశ్వర్ ల ఆధ్వర్యంలో నూతన ఆలయాన్ని నిర్మించారు.


దీంతో ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా హోమం నిర్వహించారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నూతన ఆలయాన్ని ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, ముధోల్  ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ అనిల్,  పిఎసిఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాపే వార్ కిష్టయ్య, స్థానిక సర్పంచ్ సర్వేష్ , వెంకటాపూర్ సర్పంచ్ శ్రావణి శేఖర్, తరోడ సర్పంచ్ అరిపోద్దిన్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ, ఉపసర్పంచ్ సాయినాథ్ గౌడ్, నాయకులు విఠల్ ,వంశీలు దర్శించుకున్నారు.


ఈ సందర్భంగా నాయకులను ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కన్నోల్ల రాధాకృష్ణ, రవికుమార్, రాంచరణ్, అంజయ్య, రఘు, రామ్ కిషోర్, రాంప్రసాద్, నాయకులు శివరాం, గట్టుపల్లి బీమెంధర్, చింటు, శ్రీకాంత్, అంజయ్య, గ్రామస్థులు, తదితరులు, పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్