Magazines

జుక్కల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా అలయ్ బలయ్

21 అక్టోబర్, 2026

Alai Balai
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావును మద్నూర్, డోంగ్లి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ ముగిసిన సందర్భంగా ఈనెల 21న బుధవారం తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన 'అలయ్ బలయ్' కార్యక్రమంలో ఆయన నియోజకవర్గ ప్రజలను, నాయకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మద్నూర్ పరిధిలోని మద్నూర్, డోంగ్లి మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి అలై బలై తీసుకుంటూ పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్