Magazines

నిధుల దుర్వినియోగం పై కలెక్టర్‌కు ఫిర్యాదు..

5 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ మిడ్జిల్ :  మిడ్జిల్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామపంచాయతీలో 2019 నుంచి 2023 మధ్య కాలంలో మంజూరైన నిధుల వినియోగంలో భారీగా అక్రమాలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. పంచాయతీ అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని అధికారులను పలుమార్లు కోరినప్పటికీ, వారు సరైన స్పందన ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 గ్రామానికి చెందిన శ్రీకాంత్, వెంకటయ్య, గోపాల్ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత 5 సంవత్సరాలు కాలంలో గ్రామపంచాయతీకి వచ్చిన నిధులు, చేపట్టిన పనుల వివరాలను ప్రజలకు బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. నిధుల దుర్వినియోగంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపించి, బాధ్యులైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో జరిగిన అవినీతిపై పూర్తి సమాచారాన్ని తీసుకొచ్చి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు చెప్పారు. గతంలో ఉన్న సర్పంచ్ భర్త గ్రామంలో ఉన్న డ్రైనేజ్ గ్రానైట్ రాయిని టెండర్లు వేయకుండా అమ్ముకున్నారని , గ్రామంలో ఉన్న బోరు మోటర్లను కూడా అమ్ముకున్నారని, సమాచారాన్ని అడుగుతున్న , వ్యక్తులపై ఫోను ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఫిర్యాదులో పేర్కొన్నట్లు వారు చెప్పారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్