Magazines

రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియామక పత్రం అందుకున్న దాచేపల్లి సారిక

12 నిమిషాల క్రితం

congress
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - తిమ్మాజిపేట : రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా దాచేపల్లి సారిక సోమవారం నియామక పత్రం అందుకున్నారు. తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన దాచేపల్లి సారిక తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఈ నెల 18న ఎన్నిక కాగా సోమవారం హైదరాబాదులోని గాంధీభవన్ లో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి చేతుల మీదుగా దాచేపల్లి సారిక నియామక పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా దాచేపల్లి సారిక మాట్లాడుతూ నాపై మరింత బాధ్యత పెరిగిందని పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్