నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి. హరిత మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏ ప్రశ్ననూ వదలకుండా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నర్సింహారావు, దుర్గయ్య, గైడ్ టీచర్ రాంమోహనరావు తదితరులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)