Magazines

రైతుల కోసం ఎమ్మెల్యే పదవికైనా రాజీనామా చేస్తా.!

2 గంటల క్రితం

Mla Kotha Prabhakar Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 11, 2026 | 2 నిమిషాల చదవడం

- పదవి ముఖ్యం కాదు..రైతుల ప్రయోజనాలే ముఖ్యం

- దుబ్బాకను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

- పెండింగ్‌ సాగునీటి పనులు పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి

నవతెలంగాణ–రాయపోల్

రైతులకు మేలు జరుగుతుందంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని, రైతుల ప్రయోజనాలు, నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని అన్నారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే ఉన్నారనే కారణంతో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం లేదని భావిస్తే, రైతుల కోసం రాజీనామాకు సిద్ధమేనని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. దుబ్బాక నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.


బుధవారం రాయపోల్ మండలం అనాజీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి కాల్వల పనులను పూర్తి చేయాలని, మధ్యలో నిలిచిపోయిన అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పునఃప్రారంభించాలని కోరారు. రాజకీయ కక్షసాధింపు ధోరణితో రైతులకు అన్యాయం చేయడం సరికాదని, పార్టీలకు అతీతంగా రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.


తనపై కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ విమర్శలకు దిగడం సరికాదన్నారు. దమ్ముంటే అసంపూర్తి కాల్వల పనులు, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సవాల్‌ విసిరారు. రైతుల కష్టాలను గుర్తించి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని కొత్త ప్రభాకర్‌రెడ్డి స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో ఎపిఎం యాదగిరి, ఏవో నరేష్, ఆర్ఐ రాజమల్లు,గ్రా మ సర్పంచ్ సోమని నిర్మల ఇస్తారి, సర్పంచులు నరసింహారెడ్డి, అహ్మద్ పర్వీజ్, మాసంపల్లి రాజు, మాజీ జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, ఉప సర్పంచ్లు వేణుగోపాల్ గౌడ్, సంతోష్, రాజు, మండల మాజీ ఉపాధ్యక్షులు వెంకట్ గౌడ్, సత్యం, రాష్ట్ర యువజన విభాగం నాయకులు రాజిరెడ్డి, ఇప్ప దయాకర్, లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, మాజీ సర్పంచ్లు తిరుపతి నర్సింలు, రామచంద్రం గౌడ్, నాయకులు శ్రీధర్, భార్గవ్, బాలరాజ్ గౌడ్, బాగిరెడ్డి, రాజయ్య, ప్రసాద్ గౌడ్, మధు, బాలనర్స్, సీసీ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి పూర్ణచందర్, ఫీల్డ్ అసిస్టెంట్ సరిత, ఏఈఓ మాధవి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్