ఓయు జేఏసీ అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్
నవతెలంగాణ - ముధోల్
ఎల్ నినో పేరుతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు విద్యా సంవత్సరానికి ఆటంక కలిగించటం తగదని ఓయు జేఏసీ అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ సోమవారం ఒక్క ప్రకటనలో తెలిపారు. తాను, తన అనుమాయులకు అందిన కాడికి దోచుకునే కార్యక్రమం మీద ఉన్న శ్రద్ధ ట్రిపుల్ ఐటీ వీసీకీ విద్యార్థుల భవిష్యత్తు మీద లేదని ఆయన ఆరోపించారు.
గోదావరి నది తలపున పారుతున్న సకాలంలో ఇన్టేక్ వేల్ లో ఉన్న మోటర్లను రిపేర్లు చెయ్యకుండా అలసత్వం ప్రదర్శించడం వల్లనే నేడు ఈ సమస్య తలెత్తిందనీ పేర్కొన్నారు. దానికి ఎల్ నినో పేరుతో కొత్త గా ప్రచారం చేయటం తగదని అన్నారు. ఎల్ నీనో వల్ల సమస్యలు వస్తాయని దూరదృష్టితో నీటిని ఒడిసి పట్టుకోని కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సూచిస్తే పెడ చెవిన పెట్టి ఇపుడు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మోటార్లను రిపేర్ చేయాలని అనడం సరికాదన్నారు.
మూడు మోటర్లలలో ఒకటే మోటర్ వర్కింగ్ లో ఉందని, రెండు మోటార్లను చాలా రోజులుగా పని చేయడం లేదని, వాటికి ఇన్ని రోజులు ఎందుకు మరమత్తులు చేయలేదో వీసీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాటి బాధ్యతలు మిషన్ భగీరథ చూసిన, యూనివర్సిటీ చూసిన మొదటగా బాసర ట్రిపుల్ ఐటీ లో ఉన్న చెరువును నింపుకుని యూనివర్సిటీ అవసరాల కోసం వాడుకునే వెసులు బాటు ఉన్న నిర్లక్ష్యం ప్రదర్శించి విద్యార్థుల భవిష్యత్తుతో వీసీ, ఓఎస్డీ చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
తీర ఇపుడు ఆన్లైన్ తరగతుల పేరుతో ప్రకటనలు ఇవ్వడం సమంజసం కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఏ యూనివర్సిటీలో లేని ఎల్ నినో ప్రభావం ఒక్క బాసర ట్రిపుల్ ఐటీ కే వచ్చిందని ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.త మ తప్పులకు సమాధానాలు లేక కొత్త కొత్త కారణాలు చెప్పడం, వీసీకీ వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. వెంటనే పున ప్రారంభించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలని డిమాండ్ చేశారు.






కామెంట్లు (0)