అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బాలయ్య
నవతెలంగాణ-మిడ్జిల్
సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బరిగెల బాలయ్య, కాంగ్రెస్ పార్టీ మిడ్జిల్ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్ అన్నారు.
శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని మిడ్జిల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం వద్ద దళిత సంఘాల నాయకులతో కలిసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బాలయ్య, మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ.. సమాజంలోని కుల వివక్ష, అంటరానితనం వంటి అసమానతల నిర్మూలనకు జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని కొనియాడారు.
నేటి యువత, ప్రజలు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సత్యం గుప్తా, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, కొత్తూరు సర్పంచి రాములు, జాంగిర్, సాయిలు, బాల్ రెడ్డి, సాయిలు, ప్రశాంత్ రెడ్డి ,మల్లికార్జున రెడ్డి, మావిళ్ళ వెంకటయ్య ,నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మండల నాయకులు జహీర్, వెంకటేష్ గౌడు ,మల్లయ్య, మల్లేష్, ఆదాం, పసుల శివ, పర్వతాలు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)