Magazines

వైటీసీలో వైభవంగా బతుకమ్మ సంబురాలు 

1 గంట క్రితం

ashwaraopet
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 15, 2026 | 1 నిమిషాల చదవడం

- విద్యార్థుల ఆటపాటలతో కోలాహలం

- ప్రత్యేక ఆకర్షణగా అమ్మవారి అలంకరణ

నవతెలంగాణ -  అశ్వారావుపేట

సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అశ్వారావుపేట వైటీసీ(యూత్ ట్రైనింగ్ సెంటర్ - యువజన శిక్షణ కేంద్రం ) లో గురువారం బతుకమ్మ సంబరాలు కోలాహలంగా జరిగాయి. భద్రాచలం ఐటీడీఏ జేడీఎం హరికృష్ణ ప్రోత్సాహంతో, వైటీసీ మేనేజర్ అజిత్ కుమార్ ఆధ్వర్యంలో, సిబ్బంది సహకారంతో ఈ వేడుకలను నిర్వహించారు.


ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలతో పండుగ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా అమ్మవారి అలంకరణ (ఆకారం) వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. విద్యార్థులు, సిబ్బంది కలసి సంబరాల్లో పాల్గొనడంతో వైటీసీ ప్రాంగణం సందడిగా మారింది.

ఈ కార్యక్రమంలో హెచ్ఓడీ కారం వినోద్ కుమార్, సిబ్బంది అక్షయ్ కుమార్,ప్రతిభ,పావని,భవాని,ఉమ,శిక్షణార్ధులు దీపిక,గంగోత్రి, శిరీష,హరిత,మంగవేణి,సమీర తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్