- ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి
- ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటా సంతోషాన్ని నింపుతున్నాయి: ఎమ్మెల్యే రాగమయి
- ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం
నవతెలంగాణ-సత్తుపల్లి
ఖమ్మం - నల్గొండ - వరంగల్ పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి దామోదర సర్వోత్తమరెడ్డి విజయం కోసం ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పిలుపునిచ్చారు. శనివారం సత్తుపల్లికి వచ్చిన ఎంపీ ఆర్ఆర్ఆర్ స్థానిక ఎమ్మెల్యే అధికారిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ రాగమయితో కలిసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ఎంపీ రఘురామిరెడ్డి ఈ సందర్భంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో జరిగే రాజకీయాలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ‘సెమీఫైనల్స్’ లాంటివని, దీని ప్రభావం భవిష్యత్ ఎన్నికలపై ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ వద్దకు వెళ్లి వివరించాలని సూచించారు. ప్రజాసంక్షేమ పాలనను వివరిస్తూ ఎమ్మెల్సీ ఓట్లను కాంగ్రెస్ వైపు మళ్లించి సర్వోత్తమరెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటా సంతోషాన్ని నింపుతున్నాయి
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటా సంతోషాన్ని నింపుతున్నాయని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6 ఆఖరి తేదీ అని స్పష్టం చేశారు. సత్తుపల్లి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇప్పటికే కల్లూరు, తల్లాడ, పెనుబల్లి మండలాలకు సీతారామ ప్రాజెక్ట్ జలాలు అందించామని తెలిపారు. మరో నెల రోజుల్లో సత్తుపల్లి, వేంసూరు మండలాలకు కూడా నీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ ఎండి రెహానా కమల్, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






కామెంట్లు (0)