నవతెలంగాణ-నెల్లికుదురు
దేశంలో పేదల కష్టాలు కన్నీళ్లు తొలగాలని తమ జీవితాన్ని త్యాగం చేసిన కమ్యూనిస్టు అమరుల ఆశయాలను సాధించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ తొర్రూర్ డివిజన్ కార్యదర్శి ముంజంపల్లి వీరన్న అన్నారు. నెల్లికుదురు సెంటర్ వద్ద మాస్ లైన్ గద్దెపై జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. గత 80 ఏళ్ల నుండి పాలకులు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కారణంగా పేదలు మరింత పేదలుగా మారుతున్నారని అన్నారు.
అందువల్ల నిరుద్యోగం పేదరికం వలసలు ఆకలి సాగులు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిమంది గుత్త పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం దేశ సంపదలను ప్రజల శ్రమ శక్తిని కారు చౌకగా తాకట్టు పెడుతున్న పాలకులపై పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంల్ )మాస్ లైన్ తొర్రూరు డివిజన్ నాయకులు జక్కుల యాకయ్య ఇరుగు అనిల్ మండల నాయకులు దొడ్డ కేశవులు రవీందర్ లెనిన్ వెంకన్న వీరన్న బాలు యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)