Magazines

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ప్రజల కోసమా.. పశువుల కోసమా ..?

01 అక్టోబర్, 2026

double bedroom
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-నవాబు పేట 

నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నవాబుపేట మండల కేంద్రంలో నేటికీ అసంపూర్తిగానే ఉండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తికాక, పూర్తయిన ఇళ్లకు సైతం లబ్ధిదారుల ఎంపిక, పంపిణీ జరగకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సమస్యపై ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


రాజాపూర్, బాలానగర్ ప్రాంతాలపై చూపుతున్న శ్రద్ధ నవాబుపేట మండలంపై ఎందుకు చూపడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. స్థానికంగా ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయనే విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్లలేదా? అని నిలదీస్తున్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు అమలుకు నోచుకోకపోతే పేదలకు నిరాశే మిగులుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను పంపిణీ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్