Magazines

ఆత్మకూరులో ఘనంగా బతుకమ్మ సంబరాలు

8 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆత్మకూర్ 

ఆత్మకూరు పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయ ఆవరణలో శనివారం రాత్రి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, కోలాటం, బతుకమ్మ పాటలతో ఆటపాటల్లో మునిగితేలారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జి. నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాస్ లు బతుకమ్మ సంబరాల చరిత్ర, విశిష్టత గురించి వివరించారు.


తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని, మహిళలు ఐక్యంగా జరుపుకునే గొప్ప పండుగ ఇదని అన్నారు. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంప్రదాయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏ. నరేష్ కుమార్, కౌన్సిలర్లు జిందే జ్యోతి శ్రీనివాస్, భరత్, చెట్ల వనిత, కో-ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్, నాయకులు అజ్మత్ మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, సోయబ్, అశోక్, మోహన్ కుమార్, మోహన్ సాగర్, , నరేందర్, అనూష, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్