Magazines

జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

58 నిమిషాల క్రితం

accidents
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-వర్ధన్నపేట

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్  నాయుడుపేట్రోల్ పంపు నుంచి మామునూరు ప్రాంతం వరకు జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులతో పాటు జిల్లాలోని ప్రధాన రహదారులపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, ప్రమాదాల నివారణకు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలకు గల కారణాలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, వాటికి శాశ్వత పరిష్కారాలు చూపాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో అవసరమైన రహదారి మరమ్మతులు చేపట్టడంతో పాటు హెచ్చరిక బోర్డులు, రేడియం సూచికలు, స్పీడ్ బ్రేకర్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.


రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ముందుగానే ప్రమాద సూచనలు స్పష్టంగా కనిపించేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బి తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్, ఎన్ హెచ్ ఏ ఐ  ప్రాజెక్ట్ డైరెక్టర్ దివ్య, ఆర్ అండ్ బి ఇఇ రాజేందర్, ఏ డి సర్వే ల్యాండ్  రికార్డ్స్ అధికారి శ్రీనివాసులు, మునిసిపల్ సిటీ ప్లానర్ రవీందర్ రడేకర్, ట్రాఫిక్ పోలీస్ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్