Magazines

మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించాలి

2 రోజుల క్రితం

Munnur Kapu Corporation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 2 నిమిషాల చదవడం

మున్నూరు కాపు కులానికి సేవకుడిగా పనిచేస్తా
మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవన్న
నవతెలంగాణ-ఆలేరు టౌను 

రాష్ట్ర ప్రభుత్వం మున్నూరు కాపు కార్పొరేషన్ కి రూ.1,000 కోట్లు కేటాయించాలని, మున్నూరు కాపు కులానికి,

సమాజం అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని, మున్నూరు  కాపు సంఘం పటేల్స్, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ అన్నారు. ఆలేర్ పట్టణంలో మంగళవారం మున్నూరు పట్టణ కమిటీ  ఆధ్వర్యంలో సంఘం కుటుంబ సభ్యత్వ వెబ్‌సైట్‌ ని స్థానిక సంఘ సభ్యులతో కలిసి కొండ దేవయ్య పటేల్‌ ఆవిష్కరించారు. మున్నూరు కాపు సంఘ   భవన్ లొ పట్టణ అధ్యక్షులు  యేలుగల అంజయ్య  అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్నూరు కాపుల జనాభా, సభ్యుల వివరాలను కచ్చితంగా నమోదు చేసేందుకు రూపొందించిన కుటుంబ సభ్యత్వ వెబ్‌సైట్‌ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులంతా వెబ్‌సైట్‌ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరారు. సభ్యత్వ నమోదుతో సంఘం జనాభా, కుటుంబాల వివరాలను సమగ్రంగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనూ మున్నూరు కాపులు వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


మున్నూరు కాపు కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్ల నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మున్నూరు కాపు కులానికి సేవకుడిగా పనిచేస్తూ, వారి హక్కులు, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు. సమాజంలోని ప్రతి కుటుంబాన్ని సంఘటితం చేసి, ఐక్యతతో ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో.. గౌరవ అధ్యక్షులు గైనని రాజన్న పటేల్ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి రాజ్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఎలుగల ఆంజనేయులు, ఎలుగల వెంకటేష్, మాజీ అధ్యక్షులు  ఎలుగల  స్వామి, పోరెడ్డి శ్రీనివాసు, సీనియర్ నాయకులు చిరిగే శ్రీనివాసు, యేలుగల కుమారస్వామి, పత్తి రాములు,పోరెడ్డి ప్రసాద్, అల్లం భూజలింగం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్