మిషన్ భగీరథ నీరు లీక్.. ఆరు రోజుల నుండి పట్టించుకోని సంబంధిత అధికారులు
విద్యుత్, నీటిని పొదుపుగా వాడాలని ప్రభుత్వం చెప్పినా అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ - భీంగల్
వేసవికాలంలో సాగు నీరు దొరకని పరిస్థితి ఓవైపు ఉండగా.. మిషన్ భగీరథ అధికారులు ఇక్కడ తాగునీరు వృథా చేస్తున్నారు. ఓ పక్క అధికార పార్టీ ముఖ్య నాయకులు నీళ్లను, విద్యుత్తును ఇప్పటినుంచే పొదుపు చేయాలనుకుంటే మరోవైపు నీటిని వృథాగా పోవడంతో నీటితో భీంగల్ పట్టణంలోని రోడ్డు మడుగుల తయారైంది. భీంగల్ పట్టణంలోని తిరుమల హాస్పిటల్ వద్ద మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ గత 4 రోజులుగా నీరు వృధాగా పోతుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కావడం అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని శనివారం స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం చూస్తున్న అధికారులు పట్టించుకోని స్థితిలో ఉండిపోయారు. భీంగల్ పట్టణం నుండి కుప్కాల్ గ్రామానికి వెళ్లే మార్గంలో నాలుగు రోజులైనా రిపేర్ అవ్వట్లేదని చెబుతున్నారని స్థానికులు తెలిపారు.
భీంగల్ పట్టణంతో పాటు మండలంలోని జాగీర్యాల్, ఇంకా వివిధ గ్రామలలో మిషన్ భగీరథ పైపులైన్ పగిలి ఆరు రోజులుగా పైప్‌లైన్ లీకై నీరు రోడ్లపై పారుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. తాగునీరు భారీగా వృథాగా పోతుంది. లీకైన నీరంతా పక్కనే ఉన్న అదే మురికి గుంతలోకి చేరుతుంది. అదే మురికి నీరు తిరిగి రివర్స్ పైపులోకి వెళుతుందని, పట్టణవాసులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఆయా గ్రామల కార్యదర్శుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించడం లేదని, అది మా పని కాదని మిషన్ భగీరథ వాళ్లు వచ్చి రిపేర్ చేస్తారని అంటున్నారే తప్ప వాళ్లు వచ్చి రిపేర్ చేసింది లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ కలుషిత నీరు తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీరు, విద్యుత్‌ను కనీస అవసరాలకే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని, వాటిని వృథా చేసేవారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం ఓ మీడియా సమావేశంలో అన్నారు. ప్రజలకు హితబోధ చేసే ముందు ప్రభుత్వ అధికారులు, అన్ని పార్టీల నాయకులు నీరు, విద్యుత్ పొదుపు చర్యలను ఆచరించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, నీటి పైపు తొలగించి మరోవైపు బిగించి. అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తుందని ఆరోపణలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ నుంచి నీరు లీకేజీ కాకుండా మరమ్మతులు చేయాలని ప్రజలు నాణ్యమైన మంచినీరు అందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.





కామెంట్‌లు (0)