Magazines

విద్యాశాఖ లో 12 సెక్షన్ లకు..20 మంది ఉద్యోగస్తులు

5 గంటల క్రితం

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 3 నిమిషాల చదవడం

- డీఈఓ కార్యాలయంలోని విధుల నిర్వహణకు ఉద్యోగస్తుల పోరాటం 

- శనివారం 2 గంటల పాటు అంతర్గత చర్చలు

- బదిలైనా చోట విధులు నిర్వర్తించడానికి నిరాసక్తి

- యూనియన్ నాయకుల జోక్యం

- కలెక్టర్ తోనే సాద్యం

నవతెలంగాణ - నిజామాబాద్ సిటీ

జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు స్వప్రయోజనాల కోసం ఎక్కువగా ఆరాటపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి, ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏ1 నుండి ఏ6 వరకు, బీ1నుండి బీ6 వరకు 12 సెక్షన్లు ఉండగా 20 మంది ఉద్యోగస్తులు అక్కడ పని చేయుటకు పోటీ పడుతున్నారు. కాగా ఉద్యోగస్తులకు వేతనం రావడం లేదా...? వచ్చిన వ్యక్తిగత ప్రయోజనాలు..వనరుల కోసం పోట్లాట ఎందుకు...? చేస్తున్నారు అనే ప్రశ్న మిగితా శాఖ అధికారులకు, ఉద్యోగస్తుల కు జిల్లా సమీకృత కార్యాలయంలో చర్చగా మారింది. ఇదంతాయు  విద్యాశాఖ ఉద్యోగస్తులు శనివారం విధి నిర్వహణ సమయంలో 2 గంటల పాటు డిఇఓ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో అంతర్గత ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకున్నారు.

మాకు అన్యాయం జరుగుతుంది

 అందులో ముఖ్యంగా ఏవరికివారే వనరులకు సంబంధించిన శాఖ లేదు. వనరులకు సంబంధించినా , స్వప్రయోజనాలకు సంబంధించినా... శాఖలను మీరు తీసుకోవడం వలన మాకు అన్యాయం జరుగుతుంది, వనరుల కోసమే కొందరు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. మీరే వనరుల కోసం పనిచేస్తే మేమెందుకు పని చేయాలి.. అనే విధంగా వ్యవహారం కొనసాగుతుంది, అందులో మరి కొంతమంది నాకు ఎలాగో ప్రమోషన్ వస్తుంది, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, ఇందులో ఎవరికైనా లాభం చేస్తే, ఎప్పుడైనా నేను చెప్పే పని చేసి పెడతారు అని, మరి కొంతమంది పదోన్నతి పొందే ఉద్యోగస్తుల ఆరాటపడుతున్నారు. 

మండలలో ఉద్యోగుల అవసరం ఉన్న, ఇక్కడే

అంతేకాకుండా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ముఖ్యంగా విధులు నిర్వర్తించవలసిన సెక్షన్ లు.. హెడ్మాస్టర్ , ఎండిఎం, అకౌంట్, స్కూల్ అసిస్టెంట్, ఎస్ జి టి, మెడికల్ కు సంబంధించిన అటువంటి పనులు మాత్రమే ఎక్కువగా ఉంటాయి, అందుకు 20 మంది ఉద్యోగస్తులు ఇక్కడే ఉండటంతో.. మిగతా మండల ప్రాంతాలలో పని కుంటుపడిపోతుందని విద్యశాఖ అధికారులు మొరపెట్టుకుంటున్న, ఉద్యోగస్తులలో మాత్రం ఏ చలనం లేకుండా, మాకేంటి... అక్కడికి పోతే కావలసినన్ని వనరులు రాకుండా ఉంటాయనే ఆలోచనతో డిచిపల్లి,  మాక్లూర్, నిజామాబాద్ నార్త్, నవీపేట్ మండలాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగస్తులు అవసరం ఉంది, అయినను డిఇఓ కార్యాలయం లో పోట్లాడే ఉద్యోగస్తులు ఎవరు కూడా అక్కడికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా మిగతా మండల ప్రాంతాల్లో సైతం ఉద్యోగస్తులు అవసరం ఉంది. ఉదాహరణకి బోర్గం వంటి ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న పాఠశాలలో అకౌంట్స్ చూచుటకు జూనియర్ అసిస్టెంట్లు అవసరం ఉంటుంది. అక్కడకు ఏ ఉద్యోగస్తుడైన వెళ్లే అవకాశాలున్నప్పటికీ , అదియు నగరాల్లోనే ఉన్నప్పటికీ ఎవరు ఆసక్తి చూపటం లేదు, ఎందుకంటే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఉంటే మేము అనుకున్నంత వనరులతో ఉపయోగపేట్టుకునే విధంగా ఉంటుందని ఉద్యోగస్తులందరూ డిఇఓ కార్యాలయాన్ని వదిలి వెళ్ళడం లేదు. 

*యూనియన్ నాయకుని జోక్యం ఎందుకు...? 

కొంతమంది ఉద్యోగస్తులు యూనియన్ నాయకునికి చెప్పి పని చక్కబెట్టుకుందాము అనే ఉద్దేశంతో ఉద్యోగస్తులు యూనియన్ నాయకుడికి సమాచారం అందించారు, కాని ఉద్యోగస్తుల యూనియన్ నాయకుడు ఆరడుగుల ఆజానుబాహుడు ఆ యూనియన్ లో పనిచేసే ఒక ఉద్యోగస్తుడు గతంలో బీసీ సంక్షేమ శాఖలో ఓ మహిళ ఉద్యోగికి వేధింపులు చేయడం తో ఆ యూనియన్ ఉద్యోగస్తుడిని బీసీ కార్యాలయం నుంచి పంపించివేశారు. అదేవిధంగా వ్యవసాయ శాఖలో బదిలీ జరుగుతున్న సమయంలో మహిళ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మహిళ ఉద్యోగులు న్యాయం జరిగే వరకు బదిలీ కోసం పోరాడి యూనియన్ నాయకుని పై గెలిచారు. ఇటువంటి సందర్భంలో అవగాహన కలిగిన, ఆలోచన పరులైన ఉన్నత అధికారులు, స్వప్రయోజనాలను ఆశించకుండా ఉద్యోగారీత్యా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే వారికే న్యాయం చేస్తుండటం తో ఆ యునియన్ నాయకుడు వెనుతిరిగారు. ఇప్పుడు విద్యాశాఖ లో అదే తంతు వచ్చింది, విద్యా శాఖలో 12 మంది ఉద్యోగస్తులు అవసరం కానీ 20 మంది ఉద్యోగస్తులు ఇక్కడే పని చేస్తామనడం చాలా విడ్డూరంగా ఉంది. అవసరం లేని ఉద్యోగస్తులను కూడా ఇక్కడే పని చేయించాలని యూనియన్ నాయకుడు అధికారులకు తెలపడం చాలా దారుణమైన అంశమని ఉద్యోగస్తులు ఆరోపిస్తున్నారు, అటువంటి యూనియన్ నాయకుల వలన  విద్యా వ్యవస్థకు కూడా మచ్చ తెచ్చేలా ఉన్నాడని ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

స్వప్రయోజనాల కోసమే పోరాటం... 

ఉద్యోగస్తులు విధుల పట్ల సక్రమంగా పని చేయాలనుకునేవారైతే, ప్రభుత్వం అందించే వేతనాన్ని సరైన సమయానికి పొందుతున్నావారు, ప్రభుత్వనికి, ప్రజలకు విశ్వసనీయతగా పనిచేసేవారు ఏ కార్యాలయం లోనైనా విధులు నిర్వహిస్తారు. అలాకాకుండా జిల్లా కార్యాలయంలో పనిచేసే ఆ 20 మంది ఉద్యోగులు స్వప్రయోజనాల కోసమే పని చేస్తున్నార అనేది స్పష్టంగా కనబడుతుంది. ఆ 20 మందిని పూర్తిగా జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుండి బదిలీ చేసి, పని పట్ల ఆసక్తి ఉన్న ఉద్యోగస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి మార్చాలని ఉపాద్యాయ సంఘలు కోరుతున్నారు. 

కలెక్టర్ తోనే సాద్యం

విద్యాశాఖ అంటే ఎంతో ఆసక్తితో , విద్యార్థులను సరైన, సక్రమ మార్గంలో నడిపించేందుకై కలెక్టర్ మేడం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది, అటువంటి తరుణంలో సక్రమంగా విధులు నిర్వహించని ఇన్చార్జి డిఇఓ ను తొలగించి వేశారు. అదే విధంగా సెక్షన్లో పనిచేసే ఉద్యోగాస్తులను కూడా ఇతర కార్యాలయలకు బదిలీ చేసి, ఆసక్తిగల, పనిపై శ్రద్ధ ఉన్న ఉద్యోగస్తులని ఎంపిక చేయాలని  ఉపాధ్యాయ సంఘాలు కలెక్టర్ ని కోరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్