Magazines

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రారంభం 

45 నిమిషాల క్రితం

Bheemgal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-భీంగల్ 

భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆన్ జాబ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ చెరుకుపల్లి జయాపాల్ రెడ్డి మాట్లాడుతూ... మూడు గ్రూపులకు సంబంధించిన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మీరు మీయొక్క అధ్యాపకులు ఇచ్చిన సమాచారం ప్రకారం మీరు శిక్షణ చేయాలని అన్నారు. ఈ శిక్షణ మీకు రాబోయే రోజుల్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ శిక్షణలో భాగంగా మీరు బ్యాంకు రంగానికి సంబంధించినది కావచ్చు , అగ్రికల్చర్ సొసైటీ కి సంబంధించినది, ఫిషరీస్ సెంటర్స్కు సంబంధించినది కావచ్చు, ఇలా ఏ ఏ రంగాలలో మీకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలకు అనుగుణంగా మీరు చేసేటటువంటి జాబ్ ట్రైనింగు ఎంతగానో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని అన్నారు.


కాబట్టి క్రమశిక్షణతో, అధికారులు చెప్పేటటువంటి సమాచారాన్ని శ్రద్ధగా అర్ధం చేసుకోని వాటిని హ్యాండ్ బుక్ లలో రాసుకుని వాటిని మీ అధ్యాపకులకు వెరిఫికేషన్ కోసం చూపించాలని తెలిపారు. అంతేకాకుండా శిక్షణ తీసుకున్న ప్రతి అంశాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకొని రాబోయే రోజుల్లో ఎలా దీనిని నిత్య జీవితానికి అనువహించుకోవాలో ఇప్పుడే అర్థం చేసుకోవాలన్నారు.


అంతేకాకుండా ఈ శిక్షణ అనంతరము కళాశాలకు సంబంధించిన ఇంటర్మీడియట్ మార్చిలో జరిగే చివరి పరీక్షలకు కూడా మీరు తర్ఫీదు కావలని కోరారు. మీరు గొప్పగా విద్య నభ్యసించి రాబోయే రోజుల్లో ఈ కళాశాలకు మీ తల్లిదండ్రులకు మీకు విద్యను అందించిన అధ్యాపక బృందానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు అందిస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ చెరుకుపల్లి జయపాల్ రెడ్డి, అధ్యాపక బృందం, ఫిషరీస్ గ్రూప్ అధ్యాపకులు, ఎస్ శ్రీనివాస్, అకౌంటింగ్ ట్యాగ్గేషన్ అధ్యాపకులు, ధన్పాల్ క్రాంతి కృష్ణ, ఆఫీస్ అసిస్టెంట్ షిప్ అధ్యాపకులు శోభారాణి, ఎస్ శ్రీకాంత్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్