•ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య
నవతెలంగాణ-మర్రిగూడ
అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఆరోగ్యశ్రీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
సిఐటియు ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల మహా ధర్నాతో ఇప్పటికైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి తక్షణమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా 42 వేల రూపాయల కనీస వేతనం,ఉద్యోగ భద్రత,పిఆర్సి అమలు,డి ఏ పెంపు,ప్రభుత్వ సంస్థల పరిరక్షణ,నాలుగు లేబర్ కోడ్ ల రద్దు,ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.





కామెంట్లు (0)