నవతెలంగాణ - భీంగల్
పట్టణంలో పేరుకు పోయిన మురుగు నీరు, చెత్తా, డ్రైనేజీ వ్యవస్థపై శనివారం రాసిన "భీంగల్‌లో డ్రైనేజీ అస్తవ్యస్తం" అనే కథనానికి అధికారుల నుంచి స్పందన లభించింది. ఈ మేరకు సోమవారం పారిశద్ధ్య కార్మిక సిబ్బందితో శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ.. రోడ్లపై మురుగు నీరు నిల్వకు నివారణ చర్యలు వెంట వెంటనే చేపడుతామని తెలిపారు. డ్రైనేజీ కాలువలలో పూడికతీత, కాలనీల్లో చెత్త పేరుకుపోకుండా త్వరతగతిన శుభ్రం చేయిస్తామని పేర్కొన్నారు. తద్వారా ప్రజలకు ఈగలు, దోమలతో అంటువ్యాధులు ప్రబలకుండా ఉంటాయని చెప్పారు. కాలనీ మొత్తం శుభ్రం చేయించడంతో అందుకు కృషి చేసిన మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, కార్మికులతో పాటు ప్రత్యేకంగా నవతెలంగాణ విలేకరికి స్థానికులు అభినందనలు తెలిపారు.






కామెంట్‌లు (0)