Magazines

సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి

1 గంట క్రితం

aituc
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 28, 2026 | 1 నిమిషాల చదవడం

- ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు నిమ్మటూరి రామకృష్ణ

- ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట వంట కార్మికుల ధర్నా 

నవతెలంగాణ-సత్తుపల్లి 

​మధ్యాహ్న భోజన పథకంలో సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని  డిమాండ్ చేస్తూ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు వంట కార్మికులు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ 

​​నిరసన అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని క్యాంపు కార్యాలయ సిబ్బందికి అందజేశారు. ​ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ... కార్మికులు 23 ఏళ్లుగా ఎన్నో కష్టాలకోర్చి విద్యార్థులకు వంట చేసి పెడుతున్నారన్నారు.


ఇప్పుడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం తెచ్చేందుకు సిద్ధపడటం దారుణమన్నారు. ​ప్రభుత్వ విద్యాసంస్థల్లో అమలు చేయాలనుకుంటున్న ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ​పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా భోజన మెనూ ఛార్జీలను వెంటనే పెంచాలని కోరారు. ​మధ్యాహ్న భోజన వంట కార్మికులకు నెలకు రూ. 26 వేలు కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ​పాఠశాలల్లో భోజన తయారీకి కావలసిన వంటగ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు. ​వంట కార్మికులందరికీ ప్రభుత్వం వెంటనే అధికారిక గుర్తింపు కార్డులు అందజేయాలని కోరారు. ​కార్మికులకు ప్రమాద బీమాతో పాటు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు.


సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులు, మెనూ ఛార్జీలు, కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించి కార్మికులను ఆదుకోవాలన్నారు.

​బహిరంగ మార్కెట్ రేట్లకు అనుగుణంగా కోడిగుడ్ల ఛార్జీలను కూడా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ​ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా
ఉపాధ్యక్షురాలు గుదే రాజ్యలక్ష్మి, మండల ప్రధాన కార్యదర్శి మహాదేవ లక్ష్మి, నాయకులు పి. సీత, జరీనా, శ్రీలక్ష్మి, జీవ, మాణిక్యం, నాగలక్ష్మి,  సుజాత, నాగమ్మ, సక్కుబాయి, చంటమ్మ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్