- ముధోల్ బిఆర్ ఎస్ ఇంచార్జి కిరణ్ కొమ్రే వార్..
నవతెలంగాణ-కుభీర్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన ఏ ఒక్క హామీలను నెరవేర్చకుండా మాయ మాటలు చెప్పి ప్రజలకు, యువతకు మభ్యపెట్టి రెండేన్లు గడుస్తున్న ఇప్పటి వరకు హామీలను నెరవేర్చలేదని. ముధోల్ నియోజక వర్గ బిఆర్ ఎస్ సమన్వయ కమిటీ సభ్యుడు కిరణ్ కొమ్రే వార్ డిమాండ్ చేశారు.సోమవారం కుభీర్ మండల కేంద్రంలో విలేకరల సమావేశం లో అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వృద్దులకు, బీడీ కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేసి విడుదల చేయాలన్నారు. దింతో పాటు ఎన్నికల మేనిపెస్టో లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 4వేలు పెంచాలని సూచించారు.గతంలో రాజీవ్ యువ వికాస్ కింద దరఖాస్తులు స్వీకరించి రెండేళ్లు గాడుస్తున్నప్పటికీ యువతకు ఎలాంటి సహాయం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ధ్వజమెత్తారు.దింతో లక్షలాదిమంది నిరుద్యోగ యువకులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.దింతో రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేసి అరులైన యువతకు, మరియు వృద్దులకు,బీడీ కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలిని డిమాండ్ చేశారు. లేని పక్షంలో గ్రామల్లో ఉన్న యువతతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆయన వెంట బిఆర్ ఎస్ మండల అధ్యక్షులు ఎన్నిల అనిల్ పుప్ఫల పీరాజీ,మాజీ ఎంపీటీసీ దొంతుల దేవిదాస్,సీనియర్ నాయకులు దత్తు సింగ్,నగేష్,నిమ్మ లక్ష్మణ్,రాములు, భోజరం పటేల్ బిఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.





కామెంట్లు (0)