Magazines

అర్హులందరికీ సంక్ష‍ేమ పథకాలు: ఎమ్మెల్యే అనిరుధ్‌

2 గంటల క్రితం

Mla Anirudh Reddy
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మిడ్జిల్ 

అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మున్నానూరు, మిడ్జిలు, బోయిన్పల్లి, మల్లాపూర్, కొత్తూర్, వెలుగొమ్ముల, అయ్యవారిపల్లి, చిల్వేర్ గ్రామాలలో స్మార్ట్ రేషన్ కార్డులను ఆయా  గ్రామాల సర్పంచులతో కలిసి పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన మూడేండ్లలోపే అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తోందని చెప్పారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, తహసిల్దార్ రాఘవేందర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి  గౌస్ రబ్బాని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్, ఎస్సీ డిపార్ట్మెంట్ మండల అధ్యక్షులు చెన్నయ్య, యూత్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ్, ఆయా గ్రామాల సర్పంచులు సుజాత మల్లికార్జున రెడ్డి, ఎడ్ల శంకర్ ముదిరాజ్ , శశికళ లక్ష్మారెడ్డి, రాములు, సువర్ణ, నాగరాజు గౌడ్, మాధవి మల్లేష్, మండల నాయకులు సాయిలు, నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్, ప్రశాంత్ రెడ్డి, వెంకట శివప్రసాద్, బాబా, బంగారు, సత్యం గౌడ్, ఆదామ్, జహీర్,  చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్