సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించాలి
మకర్‌ద్వార్ నుంచి నిర్వాచన్ సదన్‌కు ఇండియా బ్లాక్ ఎంపీల భారీ మార్చ్
అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు
ఎంపీలను ఈడ్చుకెళ్లి అరెస్టులు... తీవ్ర ఉద్రిక్తత
పోలీసుల చర్యల్లో పలువురు ఎంపీలకు గాయాలు
వతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’, ‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలి’ అని డిమాండ్ చేస్తూ దేశ రాజధానిలో ప్రతిపక్ష ఎంపీలు భారీ ఆందోళన చేపట్టారు. పార్లమెంట్‌లోని మకర్‌ద్వార్ నుంచి ఎన్నికల కమిషన్ కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’కు ‘ఇండియా బ్లాక్’ ఎంపీలు భారీ మార్చ్ చేపట్టారు. ‘జ్ఞానేశ్.. ఇట్స్ డన్.. బ్రో.. టైం టు రిజైన్’, ‘‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’’ ప్లకార్డులు చేబూని నినాదాలు హోరెత్తించారు.ఈ మార్చ్‌లో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు అమ్రారామ్, సీపీఐ(ఎం) లోక్‌సభ పక్షనేత కె. రాధాకృష్ణన్, సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్, ఎంపీలు ఎఎ రహీం, వి. శివదాసన్, ఎస్. వెంకటేశన్, జి. సచ్చిదానందం, సీపీఐ ఎంపీలు పి. సంతోష్‌కుమార్, పి.పి. సునీర్, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, టీఎంసీనేత అభిషేక్ బెనర్జీ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఎంపీ ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు. మకర్‌ద్వార్ నుంచి ప్రారంభమైన మార్చ్ ఆకాశవాణి భవన్ సమీపంలోకి రాగానే
‘ఎన్నికల సంఘం పనితీరుపై ప్రశ్నలు ప్రస్తుత ‘సర్’ వివాదానికే పరిమితం కాదు. గతంలో కూడా ఎన్నికల కమిషనర్‌పై ఆరోపణలు వచ్చాయి. 2017, 2019, 2022, 2024ల్లో ఎన్నికల కమిషన్ అవినీతికి పాల్పడింది. ఇక బెంగాల్లో అయితే ఇది వారు పూర్తిగా బహిరంగంగా ఆడిన ఆట.
ఇది ఎవరికీ కనిపించడం లేదా?. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనడానికి ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికలు, చండీగఢ్ మేయర్ ఎన్నికలను ఉదాహరణ. యూపీ ఉప ఎన్నికలు ఓట్ల దొంగతనం ఎలా జరిగిందో స్పష్టంగా చూపించాయి. చండీగఢ్ ట్రిక్‌ను ఎవరు మర్చిపోగలరు?’’ ( మొదటిపేజీ తరువాయి ) పోలీసులు, కేంద్ర బలగాలు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి మార్చ్‌ను అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ధర్నాకు దిగారు. బారికేడ్లు దాటేందుకు ఎంపీలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులను నెట్టుకుంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కారు. ఓ బారికేడ్‌పై నిలబడి రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఊపారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నిరసనకు సంఘీభావం తెలిపారు. పోలీసుల చర్యల్లో పలువురు ఎంపీలు గాయపడినట్టు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పేర్కొన్నారు.
ఎంపీలను ఈడ్చుకెళ్లిన పోలీసులు
ఎన్నికల కమిషన్ కార్యాలయానికి మార్చ్‌గా బయలు దేరిన ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారు. వృద్ధులు, మహిళా ఎంపీల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఈ ఘటనలో కొందరి దుస్తులు చిరిగిపోయాయి. మార్చ్‌లో పాల్గొన్నవారిని పోలీసులు అరెస్టు చేయడం ప్రారంభించడంతో వామపక్ష ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించారు. అమ్రారామ్, జాన్ బ్రిటాస్, ఎఎ. రహీం, ఎస్. వెంకటేశన్, జి. సచ్చిదానందం, పిపి. సునీర్, జోస్ కె. మాణి తదితర ఎంపీలు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ హైబీ ఈడెన్ కూడా వామపక్ష ఎంపీలతో కలిసి నిరసనలో పాల్గొన్నారు. వామపక్ష ఎంపీలపై ఢిల్లీ పోలీసులు దాష్టీకానికి పాల్పడ్డారు. పోలీసుల దాడిలో సీపీఐ(ఎం) ఎంపీ ఎఎ రహీం వీపుపై గాయాలైన చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, ఎఎ రహీం తదితరులను పోలీసులు రెండుసార్లు అరెస్టు చేశారు. తొలుత ఎంపీలను ఈడ్చుకెళ్లి బలవంతంగా పోలీసు బస్సుల్లోకి ఎక్కించారు. ఆందోళన తీవ్రతరం కావడంతో కొంతసేపటి తరువాత వారిని పోలీసులు విడుదల చేశారు. అయితే అరెస్టులకు భయపడకుండా ఎంపీలు తిరిగి ఆందోళన ప్రాంతానికి చేరుకున్నారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు మార్చ్ కొనసాగించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిపై మరోసారి విరుచుకుపడ్డారు. ముగ్గురు ఎంపీలను ఈడ్చుకుంటూ వెళ్లి రెండోసారి అరెస్టు చేశారు. అనంతరం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. గంటల తరబడి నిర్బంధించిన అనంతరం వారిని పోలీసులు విడుదల చేశారు.
మార్చ్‌ను అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకాశవాణి భవన్ గేటు దాటి ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారినీ అడ్డుకోవడంతో వారు అక్కడే గంటల తరబడి బైఠాయించారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి తమ డిమాండ్లను వినిపించేందుకు అనుమతించాలని, అంతవరకు కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
భారీగా భద్రతా బలగాల మోహరింపు
నిరసనలను అడ్డుకునేందుకు ఢిల్లీలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఢిల్లీ పోలీసులు, ఆర్పీఎఫ్తో పాటు సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ సిబ్బందిని కూడా నిరసన ప్రాంతాల్లో మోహరించినట్టు పేర్కొన్నాయి. దాదాపు 3వేల మంది ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు మోహరించాయి. రహదారులపై పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేయడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపాయి. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారని, మీడియా ప్రతినిధులను నిరసన ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఎన్నికల కమిషన్ వ్యవస్థను కాపాడాలని, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఆందోళనలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని వామపక్ష నేతలు విమర్శించారు.
మకర్ ద్వార్ నుంచి ప్రారంభమైన మార్చ్‌లో కాంగ్రెస్, సీపీఐ(ఎం), సీపీఐ, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, టీఎంసీ, సీపీఐ(ఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్, జేఎంఎం, వీసీకే, ఐయూఎంఎల్, ఆర్ఎస్పీ, బీజేడీ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. అయితే తొలిసారి ఒడిశాకు చెందిన బీజేడీ ఎంపీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. బీజేడీ ఎంపీలు మానస్ మంగరాజ్, సులతా దేవ్ ఉన్నారు. పార్టీ అధినేత, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాల మేరకే నిరసనలో పాల్గొన్నట్టు మంగరాజ్ తెలిపారు.
ఇదొక చారిత్రాత్మక పోరాటం :
సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్
‘‘
మేము పార్లమెంట్ వీధిలో ఉన్నాం. ఎన్నికల సంఘం కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నాం. ఎన్నికల సంఘం తన విశ్వసనీయతను ఒక సెకను పాటు కూడా కొనసాగించే అర్హతను కోల్పోయింది. మేము ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఈ చారిత్రాత్మక ఆందోళన ప్రతిధ్వని ఈ దేశపు నలుమూలలా వినిపిస్తుంది. వారు ప్రపంచానికి సరైన సందేశం ఇవ్వాలి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి. లేదంటే తొలగించాలి. ఆయనను ఢిల్లీ హైకోర్టుకు పంపాలి. పోలీసులను చూడండి... వారు భారీ సంఖ్యలో మోహరించారు. మేము ఈ దేశానికి శత్రువులమని వారు భావిస్తున్నారు. వారు ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ దేశానికి నిజమైన శత్రువు మోడీ, షా...సర్కార్ చేతిలో రక్షించబడుతున్నారు. ఈ ఆందోళన దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి. రాబోయే రోజుల్లో మన దేశంలో మరింత ఉత్సాహంతో, అంకితభావంతో, నిబద్ధతతో కూడిన పెద్ద ఎత్తున ఆందోళనలు చూస్తాం’’
ఈ పోరాటం నిరంతరం సాగుతుంది : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు, లోక్‌సభ ఎంపీ అమ్రారామ్
‘‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్, మోడీ కలిసిపోయి ఉన్నారు. ఈ ‘సర్’ చేయడానికి ముందే మోడీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై ఎక్కడా పిటిషన్ దాఖలు కాకూడదు, వారిపై ఎలాంటి కేసు నమోదు కాకూడదనే చట్టాన్ని చేసింది. ఆ తరువాత ‘సర్’ ప్రక్రియ చేపట్టి దేశవ్యాప్తంగా 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారు. ఎవరైతే ఓట్లు కోల్పోయారో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టు కూడా విచారకరంఇగా ‘తదుపరి అవకాశం ఇవ్వండి’ అని చెప్పింది. ఓటు హక్కును హరించే ఈ చర్య ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కులను హతమార్చడమే. కచ్చితంగా ఇలాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రభుత్వం, దాని సాధనంగా ఉన్న జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి. ప్రజల ఓట్లను తిరిగి చేర్చాలి. సీఈసీపై దేశద్రోహ చట్టం కింద చర్యలు తీసుకోవాలి. మేము రోడ్లపై నుండి పార్లమెంట్ వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. సాధారణ ప్రజలను జాగృతం చేస్తాం. 13 కోట్ల మంది ఓట్లను తిరిగి చేర్చే వరకు, సీఈసీపై దేశద్రోహ చట్టం కింద కేసు పెట్టే వరకు ఈ పోరాటం నిరంతరం సాగుతుంది. బీజేపీ తన తప్పులను దాచివేయడానికి ప్రయత్నిస్తోంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడులు చేయడం, లాఠీచార్జి చేయడం, కేసులు బనాయించడం లాంటివి చేశారు. కానీ చివరికి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. అలాగే జ్ఞానేష్ కుమార్ కూడా రాజీనామా చేసి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మేము లాఠీలకు, తూటాలకు భయపడేవాళ్ళం కాదు’’
ఈసీ బీజేపీ కోసం పనిచేస్తోంది :
సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్
‘‘దేశంలో ఎన్నికల ప్రక్రియను, ఎన్నికల సంఘం పని తీరును ప్రశ్నిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు ప్రభుత్వ వ్యతిరేక పోరాటంగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్నాయి. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థలా దేశం కోసం కాకుండా కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్ల కోసమే పని చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం, రాజకీయ భేదాభిప్రాయాలను పక్కన పెట్టి అందరూ కలిసి ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై నిలబడ్డాం’’ ఇ
జ్ఞానేష్ బ్రో అంతా అయిపోయింది:
లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ
‘జ్ఞానేష్ బ్రో అంతా అయిపోయింది..రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వీరంతా ఓటు చోరీతో దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనికి త్వరలోనే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దేశద్రోహంతో సమానం. బీజేపీని ఎదుర్కోవడం మాత్రమే మా లక్ష్యం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నాం. ‘సర్’లో అవకతవకలకు బాధ్యత వహిస్తూ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి. 300 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు ఎన్నికల కమిషనర్లను కలిసేందుకు వచ్చారు. ఎన్నికల సంఘం కార్యాలయం కొద్ది దూరంలోనే ఉన్నప్పటికీ మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు. మేము దేశ ప్రజల ప్రతినిధులం. ఎన్నికల కమిషనర్లను కలవడం మా హక్కు. ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా అక్రమాలపై తమ పోరాటం కొనసాగుతుంది.






కామెంట్లు (0)