నవతెలంగాణ - హైదరాబాద్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ఉత్తరప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కాన్వాయ్‌లోని ఐదు వాహనాలు, ఓ అంబులెన్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడగా, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.
పరువునష్టం కేసు విచారణకు హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ ఉదయం లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుల్తాన్‌పూర్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై కాన్వాయ్‌లోని చివరి వాహనాలు, అంబులెన్స్ పరస్పరం ఢీకొన్నాయి. రాహుల్ ప్రయాణిస్తున్న వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాన్వాయ్‌లోని ఓ వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనుక ఉన్న వాహనాలు ఢీకొన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రమాదం స్వల్పమేనని అధికారులు పేర్కొన్నారు. ఘటన అనంతరం రాహుల్ గాంధీ తన ప్రయాణాన్ని కొనసాగించారు.






కామెంట్‌లు (0)