Magazines

నవతెలంగాణ నూతన వెబ్‌సైట్‌ను ప్రారంభించిన తమ్మినేని వీరభద్రం

4 గంటల క్రితం

Tammineni Veerabhadram launches new website for Navatelangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: నవతెలంగాణ నూతన వెబ్‌సైట్‌ను మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ నేటి ఆధునిక యుగంలో వార్తలు, సమాచారం క్షణాల్లో చేరవేయడంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోంది. సాంప్రదాయ వార్తా సాధనాల కంటే వేగంగా, ఒక క్లిక్ దూరంలో వార్తలను అందించే సౌలభ్యం డిజిటల్ మీడియా సొంతం. దానిని మనం అందిపుచ్చుకుని ఎప్పటికప్పుడు ఆధునీకరించి ఉంచుకొని ముందు వెళ్తున్నాం. ఆ క్రమంలోనే ఆధునికరించుకున్న వెబ్ సైట్ ను నేను మనం ప్రారంభించుకున్నామని అన్నారు. ఆధునికతను ఎప్పటికప్పుడు అందుకోవడం అనేది నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలని ఆయన సూచించారు.‌

ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌ రీజియన్ జనరల్‌ మేనేజర్‌ లింగారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి. ప్రభాకర్‌, ఎడిటర్‌ రాంపల్లి రమేష్‌, బుక్‌హౌస్‌ ఎడిటర్‌ ఆనందాచారి, జనరల్‌ మేనేజర్లు, మేనేజర్లు, బోర్డు సభ్యులు, సిబ్బంది, విలేకరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్