Magazines

అక్షరం ఆలోచనకు ఆయుధం

47 నిమిషాల క్రితం

written word is a weapon
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 2 నిమిషాల చదవడం

పుస్తక సంస్కృతిని విస్తరించడం సామాజిక బాధ్యత : హైదరాబాద్‌ ‌బుక్‌ ‌ఫెయిర్‌ అధ్యక్షులు రాంపల్లి రమేష్

డిసెంబర్ 18 నుంచి 28 వరకు 
బుక్‌ ఫెయిర్ సొసైటీ నూతన కమిటీ ఎన్నిక


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పుస్తకం సమాజాన్ని అర్థం చేసుకునే చూపునిస్తుందనీ, స్థిరపడిన భావాలను ప్రశ్నించే ధైర్యాన్నిస్తుందనీ, కొత్త ఆలోచనలకు దారులు తెరుస్తుందని హైదరాబాద్ బుక్‌ ‌ఫెయిర్‌ సొసైటీ నూతన అధ్యక్షులు రాంపల్లి రమేష్ అన్నారు. అందుకే బుక్ ఫెయిర్‌ను కేవలం పుస్తకాల ప్రదర్శనగా కాకుండా, ఆలోచనా స్వేచ్ఛను, సామాజిక చైతన్యాన్ని పెంపొందించే అక్షరం ఆలోచనకు ఆయుధం ప్రజాస్వామిక, రాజకీయ వేదికగా చూడాలని పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో నూతన కార్యవర్గాన్ని పరిచయం చేసి, 39వ హైదరాబాద్ బుక్‌ ఫెయిర్ తేదీలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి 28 వరకు తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో బుక్‌ ‌ఫెయిర్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. ‘సమాజంలో ఎవరి ఆలోచనలకు చోటు దక్కుతోంది. ఎవరి అనుభ వాలు సాహిత్యంలో ప్రతిఫలిస్తున్నాయి, అణగారిన వర్గాల గొంతులు ఎంతగా వినిపిస్తున్నాయి అనేవి కీలకమైన ప్రశ్నలు’ అని రమేష్ అన్నారు. భిన్న భావజాలాలు, విభిన్న అనుభవాలు, ప్రత్యామ్నాయ ఆలోచనలకు వేదిక కల్పించినప్పుడే పఠన సంస్కృతి ప్రజాస్వామిక స్ఫూర్తిని సంతరించుకుంటుందని పేర్కొ న్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు సహా అన్ని వర్గాల ప్రజలకు బుక్ ఫెయిర్‌‌ను మరింత చేరువ చేస్తామని తెలిపారు. పుస్తక ప్రియులు, ప్రచురణకర్తలు, సాహిత్యకారులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బుక్‌ ఫెయిర్‌‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సాంస్కృతిక కార్యక్రమాలు, బాలోత్సవాలు

పుస్తక ప్రదర్శనతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు, బాలోత్సవాలు నిర్వహించనున్నట్టు బుక్ ఫెయిర్ కార్యదర్శి పి. నారాయణరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రచురణకర్తలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాల పుస్తకాలు, సాహిత్య ప్రక్రియలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని పాఠకులకు చేరువ చేయడమే లక్ష్యమన్నారు.

ఆన్‌లైన్లో దరఖాస్తుల స్వీకరణ

ఈసారి బుక్ ఫెయిర్‌‌లో స్టాళ్ల కేటాయింపునకు సంబంధించిన దరఖాస్తులను ఆన్‌లైన్లో స్వీకరిస్తామని సొసైటీ ఉపాధ్యక్షులు కె. బాల్‌‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దరఖాస్తు విధానం, నియమనిబం ధనలను వివరించారు. ప్రచురణకర్తలకు దరఖాస్తు ప్రక్రియను మరింత సులభతరం చేయడంతోపాటు, స్టాళ్ల కేటాయింపులో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని చెప్పారు. బుకెఫెయిర్ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

నిర్వహణలో తెలంగాణ ప్రభు త్వ సహకారం, భాగస్వామ్యం తమకు మద్దతుగా నిలుస్తోందని చెప్పారు. అంతకుముందు సొసైటీ మాజీ అధ్యక్షులు కవి యాకూబ్ నూతన కార్యవర్గాన్ని మీడియాకు పరిచయం చేశారు. పుస్తకాల పండుగకు సమయం ఆసన్నమవుతోందనీ, అందరి భాగస్వామ్యం తో బుక్ ఫెయిర్ విజయవంతం కావాలని ఆకాంక్షించా రు. మీడియా సమావేశంలో జాయింట్ సెక్రెటరీ రజనీ, కార్యవర్గ సభ్యులు యు. శ్రీనివాసరావు పాల్గొన్నారు.


హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

అధ్యక్షులు: రాంపల్లి రమేష్, నవతెలంగాణ పబ్లిషింగ్ హౌస్

ఉపాధ్యక్షులు: కె. బాల్‌‌రెడ్డి, మలుపు బుక్స్

ఉపాధ్యక్షులు: శోభన్ బాబు,తెలుగు బుక్స్

కార్యదర్శి: పి. నారాయణ రెడ్డి, నవ చేతన పబ్లిషింగ్ హౌస్ సంయుక్త
కార్యదర్శి : రజని, జై భారత్ పబ్లికేషన్స్

కోశాధికారి: కె. సురేష్, మంచి పుస్తకం


కార్య నిర్వాహక వర్గ సభ్యులు..
1. యాకూబ్, కవి సంగమం

2. ‌జి.విజయరావు, 
నవ తెలంగాణ బుక్ హౌస్

3. ఎన్. మధుకర్, నవ చేతన బుక్ హౌస్

4. గీత రామస్వామి, 
హైదరాబాదు బుక్ ట్రస్ట్

5. ఎన్. కోటేశ్వరరావు, 
నవోదయ బుక్ హౌస్

6. యం. సూరిబాబు, 
 క్రియేటివ్ బుక్ లింక్స్

7. యు. శ్రీనివాస రావు, భూమి బుక్ ట్రస్ట్

8. కె. సజయ, ప్రణవ పబ్లికేషన్స్



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్