Magazines

వరద సహాయక చర్యల్లో ప్రమాదం

20 నిమిషాల క్రితం

వరద సహాయక చర్యల్లో ప్రమాదం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 04, 2026 | 1 నిమిషాల చదవడం

తమ్మిలేరు వాగులో కొట్టుకుపోయిన ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది

నవతెలంగాణ-సత్తుపల్లి

వరదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించేందుకు వెళ్లి, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది తమ్మిలేరు వాగులో కొట్టుకుపోయిన విషాదకర సంఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి మండలం బేతపల్లి పెద్ద చెరువు అలుగు వద్ద చోటుచేసుకుంది. ​బుధవారం ఉదయం చెరువు అలుగు వద్ద చేపలు కొట్టుకుపోకుండా వలలు కట్టేందుకు ఏడుగురు మత్స్యకారులు వెళ్లారు. అయితే వరద ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో వారు నీటిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే చాతకొండ 6వ బెటాలియన్‌కు చెందిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని రప్పించారు. మొదట వెళ్లిన సిబ్బంది రమేష్, మరికొందరు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ​మిగిలిన వారిని రక్షించేందుకు 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు లైఫ్ బోట్లలో చెరువులోకి వెళ్లారు. అలుగు వద్దకు చేరుకోగానే నీటి ఉధృతి తీవ్రతరం కావడంతో రెండు బోట్లు బోల్తా పడ్డాయి. దీంతో 11 మంది సిబ్బంది తమ్మిలేరు వాగు వరదలో కొట్టుకుపోయారు. సమాచారం తెలిసిన వెంటనే కలెక్టర్ దివాకర టీఎస్ స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన సిబ్బంది కోసం వాగు వెంట అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు.

ఎస్‌డీఆర్‌ఎఫ్ బోట్ల గల్లంతుపై సీఎం ఆరా

​ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని బేతుపల్లి చెరువులో స్టేట్‌ ‌డిజాస్టర్‌ ‌రెస్పాన్స్‌ ‌ఫోర్స్‌(ఎస్‌డీఆర్‌ఎఫ్) బోట్ల గల్లంతుపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు సీఎం ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ ‌జాజుకు సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్