Magazines

మమతా బెనర్జీపై కత్తితో దాడికి యత్నం?

1 గంట క్రితం

Attempted knife attack on Mamata Banerjee?
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద మంగళవారం కలకలం చోటుచేసుకుంది. ఆమె వద్దకు ఓ మహిళ కత్తితో రావడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్రమత్తమైన పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది ఆమెను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు.

మంగళవారం సాయంత్రం తన నివాసం సమీపంలోని దుర్గా పూజా పండాల్‌ను ప్రారంభించేందుకు మమత బయటకు వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. నిందితురాలు తనను మమత మేనకోడలిగా చెప్పుకుంటూ ముందుకు వచ్చిందని, వాగ్వాదానికి దిగిందని తెలుస్తోంది. తనిఖీల్లో ఆమె చీరలో కత్తి లభించినట్లు కథనాలు పేర్కొన్నాయి.

నిందితురాలిని 38 ఏళ్ల తన్నిష్ఠా సాహా అలియాస్ అనుసుయా సాహాగా గుర్తించినట్లు సమాచారం. టీఎంసీ ఎంపీ డోలా సేన్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో మమత భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, దాడి ఉద్దేశం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. మమతా బెనర్జీ మాత్రం పండాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కొనసాగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్