నవతెలంగాణ - హైదరాబాద్ : గచ్చిబౌలి ఠాణా పరిధిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. హరియాణాకు చెందిన సౌరభ్ శేఖర్ (36) రాయదుర్గం పరిధిలో సోదరుడితో కలిసి ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. శనివారం స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. రాత్రి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఆదివారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో సోదరుడు ఫోన్ చేయగా స్పందన రాలేదు. దీంతో అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు పగలగొట్టి చూడగా సౌరభ్ మృతి చెంది కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పదేళ్లుగా భోజనం చేసిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






కామెంట్‌లు (0)