నవతెలంగాణ - హైదరాబాద్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ హర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్ ప్రతిపాదించిన రోడ్‌మ్యాప్‌ను అమెరికా తిరస్కరించింది. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ.. అవసరమైతే యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, మరోసారి యుద్ధం మొదలైతే పరిస్థితులు ఊహించని స్థాయిలో భీకరంగా మారొచ్చని హెచ్చరించారు. అయితే దౌత్యానికి తలుపులు తెరిచే ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఇరాన్‌తో ఈ వారంలో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.






కామెంట్‌లు (0)