నవతెలంగాణ - హైదరాబాద్ : బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఘోర ప్రమాదం తప్పింది. గువాహటి నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్‌బస్ A321 విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్నప్పుడు టెయిల్ స్ట్రైక్ ఘటన చోటుచేసుకుంది. విమానం వెనుక భాగం రన్‌వేను తాకింది. దీంతో పైలట్లు ల్యాండింగ్‌ను నిలిపివేసి గో-అరౌండ్ చేపట్టారు. అయితే, రెండో ప్రయత్నంలో పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. ల్యాండింగ్ సమయంలో బలమైన గాలుల వీయడంతో పైలెట్లు విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు.
ఇండిగో విమానానికి తప్పిన పెనూ ప్రమాదం..
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)