Magazines

మా ప్రతిపాదనపై అమెరికా స్పందించింది : ఇరాన్

1 గంట క్రితం

రాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

ఇరాక్ నుంచి వాషింగ్టన్ సేనల
ఉపసంహరణపై సంబురాలు
టెహ్రాన్ : గల్ఫ్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలన్న తన తాజా ప్రతిపాదనపై అమెరికా స్పందించిందని ఇరాన్ తెలిపింది. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయాలని, ప్రతిగా ఏడు రోజులలో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తానని ఇరాన్ గత వారం అమెరికా ముందు ఓ ప్రతిపాదనను ఉంచిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల క్రితమే చెప్పారు. అయితే తమకు దీనిపై అధికారిక సమాచారమేదీ అందలేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ బుధవారం తెలిపారు. కాగా ఇరాన్ ప్రతిపాదనపై అమెరికా స్పందనను అరాగ్చీ తమ ప్రభుత్వానికి తెలియజేశారు. ఇదిలావుండగా పొరుగున ఉన్న ఇరాక్ నుంచి అమెరికా తన చివరి బలగాలను ఉపసంహరించుకోవడంతో ఇరాన్ మిత్రదేశాలు బుధవారం సంబరాలు చేసుకున్నాయి. 2003లో అమెరికా సేనలు సద్దాం హుస్సేన్‌ను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత చెలరేగిన హింసలో సుమారు రెండు లక్షల మంది ఇరాకీలు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా సేనలు ఇరాక్ నుంచి పూర్తిగా వైదొలగడం తమ మిత్రులైన సాయుధ బృందాల కూటమికి లభించిన విజయంగా ఇరాన్ అభివర్ణించింది. మధ్యప్రాచ్యం నుంచి అమెరికా బలగాలను తరిమివేయాలన్న తన లక్ష్య సాధన దిశగా ఇది మరో అడుగని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్