ముంబయి : ఐసిఐసిఐ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా సిద్ధార్థ మిశ్రాను నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో ఉన్న అనూప్ బాగ్చీ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మిశ్రా బాధ్యతలు చేపట్టనున్నారు. అక్టోబర్ 14 నుంచి లేదా ఐఆర్‌డిఎఐ ఆమోదం లభించిన తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఐదేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. అంతకుముందే అక్టోబర్ 6 నుంచి కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాగ్చీ అక్టోబర్ 1న రాజీనామా లేఖను బోర్డుకు సమర్పించగా.. అక్టోబర్ 13న వ్యాపార వేళలు ముగిసే సమయానికి ఆయన పదవీకాలం ముగియనుంది. బాగ్చీ త్వరలోనే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సిఇఒ బాధ్యతలను స్వీకరించనున్న విషయం తెలిసిందే.
ఐసిఐసిఐ లైఫ్ కొత్త సారథిగా సిద్ధార్థ మిశ్రా
53 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)