Magazines

రూ.6.5 కోట్లతో విద్యుత్ మౌలిక వసతుల కల్పన

6 గంటల క్రితం

khammam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 30, 2026 | 1 నిమిషాల చదవడం

- కావడిగుండ్ల, తిరుమలకుంటలో నూతన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలు

- గంగారం వరకు 5.4 కి.మీ. మేర 33 కేవీ విద్యుత్ లైన్

- టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్‌రావు

నవతెలంగాణ - అశ్వారావుపేట

అశ్వారావుపేట మండలంలో రూ.6.5 కోట్ల వ్యయంతో విద్యుత్ మౌలిక వసతులను అభివృద్ధి చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) వి. మోహన్‌రావు తెలిపారు. మండలంలోని కావాడిగుండ్ల, తిరుమలకుంట గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలను బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం వాటిని టెక్నికల్‌గా ఛార్జ్ చేసి విద్యుత్ సరఫరాకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

అదేవిధంగా అశ్వారావుపేట 220/132/33 కేవీ విద్యుత్ కేంద్రం నుంచి 33/11 కేవీ గంగారం విద్యుత్ ఉపకేంద్రం వరకు సుమారు 5.4 కిలోమీటర్ల మేర నూతనంగా నిర్మించిన 33 కేవీ విద్యుత్ లైన్‌ను కూడా టెక్నికల్‌గా ఛార్జ్ చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.

నూతన విద్యుత్ ఉపకేంద్రాలు, 33 కేవీ లైన్ అందుబాటులోకి రావడంతో వినాయకపురం సెక్షన్ పరిధిలోని గ్రామాలకు, ముఖ్యంగా గిరిజన గ్రామాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని మోహన్‌రావు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించడంతో పాటు నాణ్యమైన, స్థిరమైన విద్యుత్ అందించేందుకు ఈ మౌలిక వసతులు దోహదపడతాయన్నారు.

వ్యవసాయ రంగానికి కూడా మెరుగైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రావడంతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నూతన ఉపకేంద్రాల ఏర్పాటుతో విద్యుత్ లోడ్‌ను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు భవిష్యత్తులో పెరిగే విద్యుత్ అవసరాలను తీర్చేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం సూపరింటెండింగ్ ఇంజనీర్ జి. మహేందర్, డీఈ (కన్స్ట్రక్షన్) బి. వెంకటేశ్వర్లు, డీఈ (ఆపరేషన్) జె. భద్రు పవర్, ఏడీఈ లు బి. వెంకటరత్నం, బి. రాంబాబు, మానస, ఏఈలు కే. వెంకటేశ్వర్లు, రామకృష్ణ, నరసింహారావు, మేఘన తో పాటు ఓఅండ్‌ఎం సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్