నవతెలంగాణ-మద్నూర్
ప్రజా పాలన ప్రభుత్వ హాయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు కృషి ఫలితంగా మండల పరిధిలోని తడిహిపర్గాలో అర్హులైన లబ్దిదారులకు మూడోవిడతలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్న మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము కాకుండా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ఇందిరా మహిళల లబ్ధిదారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)