Magazines

నాశ విముక్త్‌ భారత్‌.. విద్యార్థుల ర్యాలీ

50 నిమిషాల క్రితం

madnoor
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నాశ విముక్తి భారత్ కార్యక్రమంలో భాగంగా మద్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు సోమవారం మండల కేంద్రంలో భారీ ర్యాలీ చేపట్టారు. కాలేజీ నుండి గ్రామంలోని  శివాజీ చౌక్ గాంధీ చౌక్, పాత బస్టాండ్, తదితర వాడల్లో ఈ ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు మత్తు పదార్థాల విముక్తి పై భారీ నినాదాలు చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ పాండురంగ మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీనివల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్