Magazines

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా

1 గంట క్రితం

Gurram Jashuva
avatar
Shiva Kumar

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ-వనపర్తి
నవయుగ కవి చక్రవర్తి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత గుర్రం జాషువా అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో బి.ఆర్.ఎస్ శ్రేణులు, సాహితీ వేత్తలతో కలసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. అస్పృశ్యత, అసమానతలను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చి బహుజనులలో సామాజిక స్పృహ కల్పించిన గుర్రం జాషువా ఆశయాలు కొనసాగించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


అణగారిన వర్గాలకు, బహుజనుల హక్కులకై హోదా లేని ప్రతిపక్ష నేతగా సమాజంలో కీలక పాత్ర పోషించారని వారి చరిత్ర భావితరాలకు వివరించాలన్న ఉద్దేశ్యంతో గుర్రం జాషువా జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. కవుల, కళాకారులు, సాహితీ వేత్తలు, సాహితీ ప్రియులు, దళిత బహుజన నాయకులు, జాషువా అభిమానులు, బి.ఆర్.ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, పలుస శంకర్ గౌడ్, డాక్టర్.వీరయ్య, వెంకట్ సాగర్, బాలేశ్వర్ రెడ్డి,నీలస్వామి, మంద రాము, వజ్రాల రమేష్ ,రమేష్ నాయక్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్