నవతెలంగాణ-మర్రిగూడ
ఇ-లెర్నింగ్ అకాడమీ డాక్టర్ పి.వేద ప్రకాష్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వహించిన గురు వందనం కార్యక్రమంలో మండల కేంద్రంలోని "ఎంజేఆర్" బిఈడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహమ్మద్ జబ్బార్ రాష్ట్రస్థాయి ఉత్తమ ప్రిన్సిపల్ గా అవార్డు అందుకున్నారు.వి.సుధాకర్(ప్రొఫెసర్ చాణక్య యూనివర్సిటీ బెంగుళూరు),డాక్టర్ పి.శంకర్(అసోసియేట్ ప్రొఫెసర్ న్యూ డిల్లీ) గారి చేతులమీదుగా ఆయన మెమోంటో తో పాటు ప్రశంసా పత్రం అందజేశారు.
అతనితో పాటు అదే కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు బట్టు వెంకన్న,నూర్జహాన్,మొహమ్మద్ ఖలీల్,నరసింహ రావులకు కూడా రాష్ట్ర స్థాయి ఉత్తమ అధ్యాపకులుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకితభావం,కృషి మరియు బోధన పట్ల ఉన్న అభిరుచి ఉజ్వల భవిష్యత్తుకు మార్గాన్ని వెలిగిస్తాయన్నారు.రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు అందుకున్నందుకు,బోధన పట్ల వారు చూపిస్తున్న చొరవకు పలువురు వారిని అభినందించారు.






కామెంట్‌లు (0)