Magazines

ఇది పన్ను కాదు, రుసుము కాదు మరి ఇదేంటి ?

48 నిమిషాల క్రితం

సుప్రీం కోర్టు
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం

రూ.2వేల పైబడిన యూపీఐ లావాదేవీలపై
ఫీజు వసూలుపై స్టేకు సుప్రీం తిరస్కృతి
న్యూఢిల్లీ : రూ.2వేలకు పైబడిన యూపీఐ లావాదేవీలపై ఫీజు వసూలు చేయడంపై తాత్కాలికంగా స్టే విధించడానికి సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొత్త యుపిఎ ఫీజు ఫ్రేమ్‌‌వర్క్‌‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌‌పై విచారణ జరుపుతోంది. ఈ నెల 15న కేంద్రం ప్రకటించిన ఎండీఆర్‌ ‌ఫ్రేమ్‌‌వర్క్‌ ‌నోటిఫికేషన్‌‌ను సవాలు చేస్తూ న్యాయవాది అంజన్‌ ‌దత్తా ఈ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి నోటీసులు జారీ చేస్తూ నాలుగు వారాల్లోగా కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. యూపీఐ చెల్లింపులపై 0.4శాతం చొప్పున ఎండీఆర్‌ (‌మర్చంట్‌ ‌డిస్కౌంట్‌ ‌రేట్‌)‌ను విధిస్తూ నేషనల్‌ ‌పేమెంట్స్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌‌పీసీఐ) చర్యలు తీసుకుంది. సోమవారం దీనిపై జరుగుతున్న విచారణ సందర్భంగా అసలు ఈ ఎండీఆర్‌ స్వభావం ఏమిటని జస్టిస్‌ ‌జోమాల్యా బాగ్చి ప్రశ్నించారు. ‘‘ఇది పన్ను కాదు, రుసుమూ కాదు..అటువంటపుడు ఈ అత్యవసర చెల్లింపు యొక్క పరిస్థితివభావం ఏమిటి?’’ అని అదనపు సొలిసిటర్‌ ‌జనరల్‌ ఎన్‌.వెంకటరామన్‌‌ను జస్టిస్‌ ‌బాగ్చి ప్రశ్నించారు. చెల్లింపులు, సెటిల్‌‌మెంట్‌‌ వ్యవస్థల చట్టం, 2007లోని సవరించిన సెక్షన్‌ 10ఎ రాజ్యాంగ బద్ధతను పిటిషన్‌ ‌సవాలు చేసింది. ఏ ఎలక్ట్రానిక్‌ ‌చెల్లింపులపై చార్జీలు లేకుండా రక్షణ కల్పించాలో నిర్ణయించడానికి ప్రభుత్వానికి అనియంత్రిత అధికారాలను ఈ సెక్షన్‌ ఇస్తోందని పిటిషన్‌ ‌విమర్శించింది. ఈ నేపథ్యంలో, ఎలాంటి ఆర్థిక పరిమితి లేకుండా రూపే డెబిట్‌ ‌కార్డులకు ఎలాంటి చార్జీలు విధించని రక్షణ కొనసాగుతుందని పిటిషనర్‌ ‌తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్