బాలికలు, మహిళలపై లైంగికదాడులకు వ్యతిరేకంగా నిరసన
సచివాలయం వైపు కదిలిన
వేలాది మంది విద్యార్థులు
క్యాంపస్‌లలో సీసీ కెమెరాలు,
వీధి దీపాలు ఏర్పాటు
చేయాలని డిమాండ్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బాలికలు, మహిళలపై లైంగిక దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ మార్చ్ జరిగింది. ఢిల్లీ సచివాలయం వైపు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు, బాలికలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా లైంగిక వేధింపులు, దాడులను అరికట్టేందుకు ముందస్తు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని కోరారు. కాగా
ఒక్క సెప్టెంబర్‌లోనే మైనర్లతో సహా 13 మంది మహిళలు ఢిల్లీలో లైంగిక దాడులకు గురైనట్టు ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది.
క్యాంపస్‌లలో భద్రత పెంచాలి
విద్యార్థినుల భద్రత కోసం విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల ప్రాంగణాలతోపాటు వాటి పరిసర ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేసింది. క్యాంపస్‌లు, సమీప ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు వీధి దీపాలను పెంచాలని కోరింది. మహిళలకు అత్యవసర సమయంలో రక్షణ కల్పించేందుకు పింక్ బూత్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది. లైంగిక దాడుల కేసుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని ఎస్‌ఎఫ్‌ఐ స్పష్టం చేసింది. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరింది. మార్చ్ అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రెటరీ ప్రదీప్ తయాల్‌కు అందజేశారు. బాలికలు, మహిళలపై లైంగిక హింసకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో ఎస్‌ఎఫ్‌ఐ భారీ మార్చ్
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)