Magazines

సీఈసీకి వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నిరసనలు..

1 గంట క్రితం

Save Democracy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ హైదరాబాద్: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా బ్లాక్ నేతలు జంతర్‌మంతర్‌ వద్ద నిరసనలు చేపట్టారు. 'సేవ్‌ డెమోక్రసీ'పేరుతో చేపట్టిన ఈ నిరసనలకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.నిరసన ప్రదేశానికి చేరుకున్న ఆప్‌ నేత సౌరభ్ భరద్వాజ్ సహా యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

నిరసనల నేపథ్యంలో పోలీసులు జంతర్ మంతర్‌ను మూసివేశారు.భద్రతను కట్టుదిట్టం చేశారు.సమీపంలోని 11మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.మరోవైపు సీఈసీకి వ్యతిరేకంగా కాక్రోచ్‌ జనతా పార్టీ నేడు ముంబయిలో నిరసనలు చేపట్టనుంది.ఈ కార్యక్రమానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు.ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేసే వరకూ తమ నిరసన కొనసాగుతుందని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు.సీఈసీ నియామకంలో పారదర్శకత ఉండాలని..పౌర సమాజానికి భాగస్వామ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్