Magazines

7న అంబేద్కర్‌ వర్సిటీ 27 వ స్నాతకోత్సవం

1 గంట క్రితం

Ambedkar University's 27th Convocation on the 7th
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డా. బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27 వ స్నాతకోత్సవాన్ని అక్టోబర్ 7న నిర్వహించనున్నట్టు విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. బుధవారం హైదరాబాద్ లో నిర్వహించిచన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రముఖ చిత్ర నిర్మాత, రచయిత, నటుడు బి. నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ అందజేయనున్నట్టు తెలిపారు. రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివ్ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. న్యాక్ మాజీ డైరెక్టర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ అతిథిగా పాల్గొననున్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 36,145 మంది విద్యార్థులకు డిగ్రీ,పీజీ,డిప్లొమా సర్టిఫికెట్లు, కోర్సుల్లో పట్టాలు ప్రదానం చేయనున్నారు. వీరిలో 19,800 మంది మహిళా విద్యార్థులుండగా, 16,334 మంది పురుష విద్యార్థులు డిగ్రీలు అందుకోనున్నారు. 43 మంది ఆర్మీ సిబ్బంది, 11 మంది ట్రాన్స్ జెండర్లు, 27 మంది ఖైదీలు డిగ్రీలు తీసుకోనున్నారు. 23 మంది పరిశోధక విద్యార్థులకు పీహెచ్ డీ, ఒకరికి ఎం.ఫిల్ డిగ్రీ ప్రదానం చేయనున్నారు. యుజీలో 16 మంది, పీజీలో 22 మందికి బంగారు పతకాలను ప్రధానం చేయనున్నారు.ఒడీఎల్ విధానంలోకి ప్రవేశించిన యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా 8 కోర్సులను, 4 ఆన్ లైన్ ప్రోగ్రామ్స్ ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కల్పన కోసం విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడంతో పాటు క్యాంపస్ సెలక్షన్ కోసం యూనివర్సిటీ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.
అందరికీ సమాన అవకాశాలు
పాలన, సమానత్వంపై ప్రత్యేకమైన చర్చకు యూనివర్సిటీ వేదిక కావాలనే ఆలోచనలతో డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డైలాగ్ ఆన్ గవర్నెన్స్ అండ్ ఈక్విటీ ప్రారంభించినట్టు చక్రపాణి తెలిపారు. సమాజాన్ని విభజించే అదృశ్య గోడలను తొలగించడం, అందరికీ సమాన అవకాశాలు కల్పించడం దీని లక్ష్యమని వివరించారు.. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ సబ్-ప్లాన్ నుంచి రూ. 100 కోట్లు కేటాయించిందని ఆయన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఉన్నత విద్యకు దూరంగా ఉంటున్న ఆదివాసీలు, వికలాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఎలాంటి ట్యూషన్ ఫీజు లేకుండా విద్యనందిస్తున్నట్టు చెప్పారు. మీడియా సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.వి.కె.రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ జి.దయాకర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్