Magazines

సుదూర వాణిజ్యంలో గుజరాత్ కీలక భూమిక

57 నిమిషాల క్రితం

Gujarat plays a pivotal role in long-distance trade.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

పశ్చిమ భారతదేశంలో ప్రధాన ఓడరేవుగా భరుకచ్చా
అంతర్గత వాణిజ్య కేంద్రంగా అనాహిలాపుర : హైదరాబాద్ విశ్వవిద్యాలయ 
ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్
నవతెలంగాణ-పటాన్‌చెరు
చారిత్రక కాలం నుంచి సుదూర వాణిజ్య నెట్ వర్క్ లలో గుజరాత్ కీలక భూమిక పోషిస్తోందని, ముఖ్యంగా భరుకచ్చ (బారిగజా), అనహిలపుర (అనహిలపట్టణం), సోమనాథలను ఉటంకిస్తూ, చారిత్రక ఆధారాలతో సహా హైదరాబాద్ విశ్వవిద్యాలయం, చరిత్ర విభాగం ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్ వివరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని ఆసియా అధ్యయన కేంద్రం (సీఏఎస్) ఆధ్వర్యంలో పట్టణీకరణ, లింగం, కార్మిక (యూజీఎల్) సంభాషణల ఉపన్యాస శ్రేణిలో భాగంగా, ‘తొలినాళ్లలో గుజరాత్ లోని ఓడరేవు, అంతర్గత పట్టణ కేంద్రాల మధ్య వాణిజ్య నెట్ వర్కుల అమరిక: రెండు నగరాల వాణిజ్య స్వరూపాలను విశ్లేషించడం’ అనే అంశంపై బుధవారం ఆమె ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఘోష్‌ మాట్లాడుతూ.. పెరిప్లస్ మారిస్ ఎరిథ్రాయీ, టోలెమీ రచనలు, జాతక సాహిత్యం, శాసనాలు, కైరో జెనిజా పత్రాలతో సహా సాహిత్య, శాసన, పురావస్తు ఆధారాలను ఉటంకిస్తూ ప్రొఫెసర్ సుచంద్ర ఘోష్‌ తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. గుజరాత్ దక్కన్, ఉత్తర భారతదేశం, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, విస్తృత హిందూ మహాసముద్ర ప్రపంచంతో అనుసంధానించే విస్తృతమైన సముద్ర, భూమార్గ నెట్ వర్క్‌‌లను వివరించారు. పశ్చిమ భారతదేశంలోని ఒక ప్రధాన ఓడరేవుగా భరుకచ్చా ప్రాముఖ్యతను, తీరప్రాంత, అంతర్-ప్రాంతీయ మార్గాలతో అనుసంధానించిన ఒక ముఖ్యమైన అంతర్గత వాణిజ్య కేంద్రంగా అనాహిలాపుర ఆవిర్భావాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. హిందూ మహాసముద్ర వాణిజ్యం, పట్టణీకరణ యొక్క చారిత్రక అభివృద్ధిలో గుజరాత్ ముఖ్యమైన స్థానాన్ని ఈ చర్చ నిర్ధారించింది. ఈ సమావేశానికి డాక్టర్ ఎం.వి.శ్రీకాంత, డాక్టర్ శ్రీజిత బసక్ అధ్యక్షత వహించగా, డాక్టర్ దేబద్రిత చక్రవర్తి నిర్వహించారు.


​గీతంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్-2026
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని శిక్షణ, మార్గదర్శకత్వం, వృత్తిపరమైన సలహాల విభాగం (టీఎంసీజీ), ప్రత్యామ్నాయ వృత్తి సేవల విభాగం ఆధ్వర్యంలో బుధవారం గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను నిర్వహించింది. విదేశాలలో శరదతువు (ఫాల్) 2027లో ఉన్నత విద్యా ప్రవేశాల కోసం చేపట్టే అడ్మిషన్ల ప్రక్రియపై సంపూర్ణ అవగాహనను కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఈ ఫెయిర్‌లో ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, యూకే, యూఎస్ కు చెందిన పలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులకు మాస్టర్స్ ప్రోగ్రామ్ వివరాలను తెలుసుకోవడానికి, ప్రవేశ ప్రక్రియను అర్థంచేసుకోవడానికి, స్కాలర్ షిప్పులు, ఆర్థిక సహాయం, దరఖాస్తు విధానాలపై అవగాహన పొందడానికి ఇది వీలు కల్పించింది. ఆయా విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో విద్యార్థులు ముఖాముఖి సంభాషించి, ఆయా కోర్సులలో చేరడానికి తగిన మార్గదర్శనంతో పాటు ఫీజు మినహాయింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రెజా, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ సమక్షంలో ప్రారంభించారు. టీఎంసీజీ మేనేజర్ ఎస్. సఫా సమన్వయం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్