తెలంగాణ హైకోర్టు సీజే సహా ముగ్గురి పేర్లను సిఫారసు చేసిన
కొలీజియం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సోమవారం నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసింది. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌కు జార్ఖండ్ హైకోర్టు మాతృ హైకోర్టు కాగా, జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయలకు అలహాబాద్ హైకోర్టు మాతృ హైకోర్టుగా ఉంది.
కొలీజియం సిఫారసుల అనంతరం కేంద్ర ప్రభుత్వం తదుపరి నియామక ప్రక్రియను చేపట్టనుంది. కేంద్రం ఆ పేర్లను రాష్ట్రపతికి సిఫారసు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం వారి నియామకం అధికారికంగా న్యాయశాఖ వెల్లడిస్తుంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ముగ్గురు హైకోర్టు సీజేలు
54 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 29, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)