బాపూఘాట్‌లో గాంధీజీకి గవర్నర్, సీఎం ఘన నివాళులు
డిజిటల్ మ్యూజియం ప్రారంభం
నవతెలంగాణ- మెహదీపట్నం
మహాత్ముడు చూపిన సత్యం, అహింసా మార్గాలు నేటికీ ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గవర్నర్‌తో కలిసి బాపూఘాట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను ముఖ్యమంత్రి ప్రారంభిం చారు. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర, ఆయన అందించిన శాంతి సందేశాన్ని తెలియజేసే లఘుచిత్రాన్ని వీక్షించారు. మున్సిపల్ ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రత్యేక వీడియోను కూడా ఆవిష్కరించారు. కార్యక్రమంలో
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహమ్మద్ అజారుద్దీన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు, హర్కర వేణుగోపాల్, ప్రభుత్వ విప్‌లు అద్దంకి దయాకర్, రామచంద్ర నాయక్, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్ గౌడ్, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)