Magazines

గాంధీ భవన్‌లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

50 నిమిషాల క్రితం

Mahatma Gandhi and Lal Bahadur Shastri birth anniversary celebrations at Gandhi Bhavan.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్ లోని గాంధీ భవన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు వివేక్ వెంకట్ స్వామి, అజహరుద్దీన్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రెటరీలు, పలువురు డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహం, సత్యనిష్ఠ, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు. అలాగే దేశ సేవకు అంకితమైన లాల్ బహదూర్ శాస్త్రి సరళత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశభక్తి వంటి విలువలను గుర్తుచేసుకున్నారు. వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగాలని నాయకులు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్