Magazines

మధ్యంతరం వేళ... సీనియర్లకు ట్రంప్‌ బంపర్‌ ఆఫర్‌!

2 గంటల క్రితం

Trump's bumper offer to seniors!
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

రెండు కోట్ల మందికి తాయిలాలు
ఒక్కొక్కరికీ 90 డాలర్లు ఇస్తానని హామీ

వాషింగ్టన్‌ : మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దేశంలోని సీనియర్‌ సిటిజన్ల ఓట్లపై దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వల విసిరారు. వృద్ధుల కోసం ఉద్దేశించిన ఆరోగ్య బీమా కార్యక్రమం 'మెడికేర్‌'లో నమోదైన రెండు కోట్ల మందికి పైగా అమెరికన్లకు 90 డాలర్ల చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సొమ్ము వైద్య బీమా ప్రీమియం భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. మెడికేర్‌ ఫీాఫర్‌ాసర్వీస్‌ కార్యక్రమాన్ని మెరుగుపరచడానికి కాంగ్రెస్‌ కేటాయించిన రెండు బిలియన్‌ డాలర్ల ఇంప్రూవ్‌మెంట్‌ ఫండ్‌ నుంచి ఈ చెల్లింపులు జరుగుతాయని శుక్రవారం రాత్రి ఆయన తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో తెలియజేశారు. మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్‌ ప్రజలపై ఆర్థిక పరమైన అనేక హామీలు గుమ్మరించారు. వాటిలో ఇది కూడా ఒకటి. ట్రంప్‌ నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకి ప్రస్తుతం కాంగ్రెస్‌లోని సెనెట్‌, ప్రతినిధిసభలలో స్వల్ప మెజారిటీ మాత్రమే ఉంది. ఇరాన్‌పై చేసిన యుద్ధం కారణంగా చమురు, గ్యాస్‌ ధరలు పెరగడంతో అమెరికన్ల జీవనవ్యయం బాగా అధికమైంది. దీంతో ట్రంప్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటీవలి సర్వేల్లో ఆయన రేటింగ్‌ దారుణంగా పడిపోయింది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్‌ అనేక ఎత్తుగడలు పన్నుతున్నారు. వాటిలో భాగంగానే... అర్హులైన సీనియర్లు అక్టోబర్‌ మొదటి వారంలో డిపాజిట్‌ రూపంలో 90 డాలర్లను అందుకుంటారని అధ్యక్షభవనం తన వెబ్‌సైటులో తెలిపింది. ప్రత్యేక డిపాజిట్‌ లేని వారి చిరునామాలకు చెక్కులు పంపడం జరుగుతుందని చెప్పింది. రిపబ్లికన్లు ఉభయసభలలో మెజారిటీని నిలుపుకుంటే వయోజనులైన వారందరికీ ఐదు వేల డాలర్ల చొప్పున చెక్కులు పంపాలని గత నెలలో ట్రంప్‌ ప్రతిపాదించారు. అయితే విశ్లేషకులు, ఆర్థికవేత్తలతో పాటు కాంగ్రెస్‌లోని కొంతమంది రిపబ్లికన్లు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పటికే పది లక్షల మంది అమెరికన్లకు ఐదు వందల డాలర్ల చొప్పున చెల్లింపులు జరుపుతోంది. కొన్ని చోట్ల ఈ చర్య ఓటర్లను ప్రభావితం చేయవచ్చునని వ్యూహకర్తలు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్