Magazines

నో ఫాదర్.. నో సన్

2 గంటల క్రితం

No Father... No Son
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 2 నిమిషాల చదవడం

బ్రెజిల్ లో మరో జెన్ జెడ్ ఉద్యమం.. బోల్సొనారోకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన వేలాది మంది ప్రజలు

బ్రసీలా : నిన్న ఫ్రాన్స్ నేడు బ్రెజిల్‌లో కూడా విద్యార్థుల నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు లూలా డసిల్వా, అధ్యక్ష అభ్యర్థి ఫ్లావియో బోల్సొనారో మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. వారిద్దరికీ మెజారిటీ రాక పోవటంతో.. అంతిమ పోరుకు సిద్ధమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో ఫలితాలు తేలనున్న సమయంలో.. బోల్సోనారోకు వ్యతిరేకంగా రాజధాని రియో డి జెనీరోలో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. బ్రెజిల్‌లో పెరుగుతున్న మితవాద భావజాల ప్రభావంపై కూడా విద్యార్థులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే బ్రెజిల్‌లో 1997, 2012 మధ్య జన్మించిన తరాన్ని జెన్ జెడ్ ఉద్యమం అని పిలుస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం, దేశ అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్‌లో మితవాద సెనేటర్ ఫ్లావియో బోల్సొనారో అత్యధిక ఓట్లు సాధించారు. ఫ్లావియో బోల్సొనారో ఎవరంటే.. అవినీతి ఆరోపణలపై జైలులో ఉన్న మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో కుమారుడు కావటం విశేషం. ఈ ఎన్నికల్లో బోల్సొనారో 47 శాతం ఓట్లు పొందారు. 45 శాతం మద్దతు పొందిన తన సమీప ప్రత్యర్థి, ప్రస్తుత వామపక్ష అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా కంటే ఆయన ముందంజలో నిలిచారు.

అయితే, అధ్యక్ష పదవిని చేపట్టడానికి అవసరమైన 50శాతం ఓట్లను ఎవరూ సాధించనందున, అక్టోబర్ 25న జరిగే రన్-ఆఫ్ ఎన్నికల్లో ఇద్దరూ తలపడతారు. డాయిష్ వెల్లే నివేదిక ప్రకారం, 20 ఏండ్ల సాహిత్య విద్యార్థి జోవో విక్టర్ వీరా, "బోల్సొనారో గెలిస్తే, బ్రెజిల్ అమెరికా వలస రాజ్యంగా మారుతుంది" అని అన్నారు. బోల్సొనారో సిద్ధాంతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధాంతాన్ని చాలా పోలి ఉందని, వామపక్ష భావాలున్న చాలా మంది బ్రెజిలియన్లు భయపడుతున్నారని ఆయన వ్యక్తం చేశారు. అల్ జజీరా ప్రకారం, అధ్యక్ష ఎన్నికల మొదటి రౌండ్ ఫలితాలు, లాటిన్ అమెరికాలో అధ్యక్ష పదవి వామపక్ష నాయకుడి నుంచి మితవాద నాయకుడికి మారే మొదటి దేశంగా బ్రెజిల్ మారవచ్చనే భయాలను పెంచాయి. నిరసనకారులు రియో నగర కేంద్రం గుండా కవాతు చేశారు. వారు "బోల్సోనారో వద్దు", "తండ్రి కాదు, కొడుకు కాదు" అని రాసి ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. కొందరు "నియంతృత్వం వద్దు", "బోల్సోనారో బయటకు వెళ్ళాలి" అని రాసి ఉన్న బ్యానర్లను కూడా పట్టుకున్నారు.


బ్రెజిలియన్ ప్రజాస్వామ్యానికి ముప్పు

బ్రెజిల్‌లోని మితవాద విమర్శకులు, జైర్ బోల్సోనారో చర్యలు బ్రెజిలియన్ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయని అంటున్నారు.విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న 19 ఏండ్ల ఇమ్మాన్యుయెల్ అరౌజో, "బ్రెజిల్‌లో మితవాద భావజాలం, బోల్సొనారోయిజం పెరగడం నాకు చాలా విచారంగా ఉంది" అని అన్నారు. "లూలా నాకు ఇష్టమైన అభ్యర్థి కాకపోవచ్చు, కానీ ఈ క్రూరత్వం మధ్య, మనం విమర్శిస్తూనే ఉండగలిగే వ్యక్తికి, మన వాక్ స్వాతంత్య్రా న్ని హరించగల వ్యక్తికి మధ్య ఒకరిని ఎంచుకోవలసి ఉంది." అని చెప్పారు. ఈ భావజాల పోరాటం మధ్య, బ్రెజిలియన్లు ఇప్పుడు అక్టోబర్ 25వ తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.


దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని..

25 ఏండ్ల సముద్ర రవాణా నిర్వాహకురాలు ఆలిస్ కార్నెరో మాట్లాడుతూ, "నేను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాను కాబట్టి ఇక్కడ ఉన్నాను. అలాగే భయంగా కూడా ఉంది" అని అన్నారు. ఒకవేళ మితవాద ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ట్రాన్స్‌జెండర్ అయిన తన భార్య నిరసనలు లేదా దాడులను ఎదుర్కోవలసి వస్తుందని తాను భయపడుతున్నట్టు ఆమె వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్